Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ పార్టీ ఒక సైకో పార్టీ: చంద్రబాబు
posted on: May 2, 2014 2:17PM
.jpg)
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సైకో పార్టీ అని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఇటు జగన్ మీద, అటు కాంగ్రెస్ అండ్ బొత్స మీద చీపురు తిరగేశారు. సోనియా ఆటలు ఇటలీలో సాగుతాయి కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కాదని అన్నారు. చీపురుపల్లిలో బొత్సకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. వైకాపా సైకో పార్టీల మారిపోయిందని, ఇతర పార్టీల నాయకుల మీద వరుసగా దాడులు చేస్తూ తన సైకో బుద్ధిని బయటపెట్టుకుంటోందని అన్నారు. వైకాపా మంచినీళ్ళలా డబ్బు ఖర్చు పెడుతోందని, ఆ డబ్బు ఎక్కడిదని ప్రశ్నించినవారి మీద దాడులు జరుపుతోందని విమర్శించారు. జగన్ పత్రిక సాక్షికి ఆ పేరు తప్పుగా పెట్టారని, ‘అవినీతి’ అని పెడితే బాగుండేదని బాబు ఎద్దేవా చేశారు. దొంగే దొంగ అని అరిచినట్టు, అవినీతిలో మునిగిపోయి వున్న సాక్షి పేపర్ తనమీద అవినీతి కథనాలు రాయడం విచిత్రంగా వుందని అన్నారు.


.jpg)



