Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ నీవి ప్రచారం చేసుకో చాలు.. లోకేష్
posted on: Jun 23, 2022 12:57PM
దూరంగా కనిపించేవరకూ వున్న వన్నీ మా భూములే.. అంటాడు ప్రేమ్ నగర్ సినిమాలో హీరో ఏఎన్నార్ కొత్తగా నగరానికి వచ్చినవాడికి అప్పటికే నగరంలో నాలుగు వీధులు తిరిగినవాడు ఆ కనిపించేది మనోడిదే, అక్కడంతా మనదే రాజ్యం అని గొప్పలు చెబుతూంటాడు. అసలు నేను చెప్పకుంటే సచివాలయంలో నీ పని పది రోజుల్లో అయ్యేది కాదంటాడు ఓ బ్రోకరు ఓ చిరుద్యోగితో! అదో చిత్రమయిన మనస్తత్వం. అలా చెప్పు కోవడంలో ఆదో తుత్తి!
ఆ తుత్తి ఇపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రదర్శిస్తున్నాడు. తనవి కానివి తన వల్లే జరిగాయని ప్రచారం చేసుకోవడానికి ధైర్యం చేయడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. అది అమాయకత్వం కాదు, ఎవరూ గమనించరని, గమనించినా ప్రశ్నించే ధైర్యం చేయరనీ ఓ నమ్మకం. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న ఎలక్ట్రా నిక్ కంపెనీలన్నీ తన పాలనా ప్రతిభ, తన స్నేహ బంధాలతోనే వచ్చాయని జగన్ అనడం విడ్డూరమే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎవరికో పుట్టిన బిడ్డకు తానే తండ్రిని అని చెప్పుకోవడంతో జగన్ దొరికిపోయాడని కామెంట్ చేశారు.
గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు రాష్ట్రానికి సాధించినవి తాను సాధించినవే అని జగన్ చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం ఆయన దుస్థితిని తెలియజేస్తుంది. అప్పట్లో రాష్ట్రంలో ఐ.టి కంపెనీలు, ఎలక్ట్రానిక్ కంపెనీలు రావడం, రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడింది. ఆ ఖ్యాతి తప్పకుండా చంద్రబాబుకే దక్కుతుంది. అసలు ఏపీని ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చడానికి నాటి సీఎం చంద్రబాబు చేసిన కృషి అనన్య సామాన్యం. ఇది లోకమంతా గుర్తించింది. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి జగన్‌కి అవేమీ గుర్తుకు రావడం లేదు.
కానీ ప్రజలు మర్చిపోలేదు. తన పాలన గురించి, తన పాలనా ప్రత్యేకతల గురించి, సాధించిన విజయాలను ప్రచారం చేసుకోవడానికి తనకంటూ ఏమీ లేని లోటు బాగా కనపడుతోంది. అందుకే పాపం జగన్ కి మతి భ్రమించిందేమో, చంద్రబాబు పాలన లో అభివృద్ధిని తన ఖాతాలో వేసేసుకుంటున్నారు.






