Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ సహా వైసీపీ అంతా ఒక వైపు.. వైవీ ఒక్కరూ ఒకవైపు?!
posted on: Feb 9, 2026 9:25AM
.webp)
తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ విషయంలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ నివేదిక తరువాత వైసీపీ చేస్తున్న వాదనను ఆ పార్టీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డే ఖండిస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ అంతా ఒక వైపు.. జగన్ కు సమీప బంధువు కూడా అయిన వైవీ సుబ్బారెడ్డి ఒక్కరూ మరోవైపు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
దీంతో నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది అంటూ వైసీపీ అధినేత జగన్ నుంచి ఆ పార్టీ మొత్తం చేస్తున్న వాదన ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరగలేదంటూ సిట్ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ ఊరూ వాడా ప్రచారం చేస్తుంటే.. వైవీ సుబ్బారెడ్డి మాత్రం తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ నిర్థారించిన మాట వాస్తవమేనని బాహాటంగా అంగీకరించేశారు. దీంతో వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది.
వాస్తవానికి సిట్ చార్జిషీట్ లో నెయ్యి కల్తీకి సంబంధించిన ఆధారాలును స్పష్టంగా పేర్కొంది. లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదనీ, రసాయనాలతో కలిపిన సింథటిక్ నెయ్యిని, పామాయిల్ సహా ఇతర నూనెల మిశ్రమాన్ని వినియోగించినట్లు సిట్ చార్జిషీట్ పేర్కొంది. ఇక్కడే వైసీపీ కల్తీ జరిగిందన్న విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తూ.. చంద్రబాబు చెప్పినట్లు జంతువుల కొవ్వు కలవలేదంటూ నానా హడావుడీ చేస్తూ.. ప్రజలను మభ్యపెట్టాలని చూసింది. అయితే వైసీపీ పప్పులు ఉడకలేదు. స్వయంగా జగన్ సమీప బంధువు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కల్తీ జరిగింది.. ఆ విషయాన్ని సిట్ ధృవీకరించింది అని కుండబద్దలు కొట్టేశారు.
అయితే అందుతో తమ తప్పేమీ లేదు, అధికారులు , ధర్డ్ పార్టీ వ్యక్తుల వల్ల ఈ కల్తీ జరిగిందని ఆయన అశ్వద్ధామ కుంజర: అన్న తీరుగా వ్యాఖ్యలు చేశారు. అయితే కల్తీ జరిగిందని వైవీ ధృవీకరించి, కల్తీ జరగలేదన్న జగన్ వాదనను పూర్వపక్షం చేశారు. తద్వారా జగన్ కు, వైసీపీకి దిక్కుతోచని పరిస్థితి కల్పించారు. ఇప్పటివరకు తాము చేస్తున్న నిర్దోషిత్వం ప్రచారాన్ని సొంత పార్టీ సీనియర్ నేత, మాజీ టీటీడీ చైర్మనే పటాపంచలు చేయడంతో ఒక్క సారిగా కంగుతిన్నారు. వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకోలు.. వైసీపీకి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.



.webp)


