TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దావోస్ కు కాదు లండన్ లో ల్యాండ్.. జగన్ టూర్ లో ఇదేం ట్విస్ట్!

Published on: Sat May 21, 2022 8:18AM

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దావోస్ అని చెప్పి లండన్ లో ల్యాండ్ అయ్యారు. ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్ వెళ్లడానికి కోర్టు అనుమతి తీసుకున్న ఆయన అత్యంత రహస్యంగా దావోస్ కంటే ముందు లండన్ లో  ల్యాండ్ కావడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

షెడ్యూల్ ప్రకారం దావోస్ లో ల్యాండ్ కావలసిన ఆయన స్పెషల్ ఫ్లైట్ ఎందుకు డైరెక్షన్ మార్చుకుని లండన్ లో ల్యాండ్ అయిందనడానికి పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. ప్రస్తతుం తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా లండన్ లోనే ఉండటమే కారణమని సూత్రీకరిస్తున్నారు. లండన్ నుంచి కేటీఆర్ కూడా దావోస్ ఆర్థిక సదస్సుకు హాజరౌతారు.

జగన్ కూడా నేరుగా దావోస్ వెళ్లకుండా లండన్ లో ల్యాండ్ అవ్వడానికి ఇదే కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ఇరువురి మధ్యా రహస్య భేటీకి దావోస్ వేదిక కానుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు జగన్ లండన్ లో ల్యాండ్ అవ్వడంతో కేటీఆర్, జగన్ ల రహస్య భేటీకి లండన్ వేదిక కానుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. జగన్ కోర్టు పర్మిషన్ తీసుకుని మరీ ప్రత్యేక విమానంలో తన సతీమణితో కలిసి దావోస్ కు బయలు దేరారు. ఆయనతో పాటు దావోస్ కు బయలు దేరిన బృందం  మాత్రం వేరే విమానంలో నేరుగా దావోస్ చేరుకున్నారు. జగన్ మాత్రం తన స్పెషల్ ఫ్లైట్ ను లండన్ లో ల్యాండ్ చేయించారు.

ఆయన తన లండన్ పర్యటన విషయంలో  ఇంత గోప్యత పాటించడంతోనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  కనీసం కోర్టుకైనా తాను దావోస్ కు ముందు లండన్ లో పర్యటించనున్నట్లు తెలియజేసి అనుమతి తీసుకున్నారా? అలా తీసుకోనట్లైతే కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆయన మరో కేసు ఎదుర్కొన వలసి ఉంటుందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఏమి ఏమైనా జగన్ లండన్ రహస్య టూర్ పై వైసీపీ వర్గాలలో కూడా అయోమయం నెలకొంది. ప్రజల సొమ్మతో సొంత పర్యటనలకు జగన్ ఎవరు అధికారమిచ్చారంటూ విపక్షాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నాయి.