జగన్ పార్టీలోకి సంచలన నాయకుడు..!!

 

 

 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డీని చంచల్ గూడ జైలులో అత్యంత సన్నిహితుడు కలిసినప్పుడు రాష్ట్రంలో సంచలనం కలిగే ఒక నాయకుడు త్వరలో మన పార్టీలో చేరబోతున్నాడని ఒక వ్యాఖ్య చేసినట్టు తెలుగువన్ కి అందిన విశ్వసనీయ కథనం.

 

ఇంతకీ జగనన్న చెప్పిన ఆ సంచలన నాయకుడు ఎవరా?అని రాజకీయ విశ్లేషకులు తమ మొదడుకు పదును పెడుతుండగా...తాజాగా రాష్ట్రంలో జరిగిన హరికృష్ణ రాజీనామా విషయం చర్చనీయాంశమైంది. మొదట చంద్రబాబుతో విభేదించి ''అన్న తెలుగుదేశం పార్టీ'' పెట్టిన హరికృష్ణ తిరిగి టిడిపి పంచనే చేరాడు. ఇప్పుడు చంద్రబాబును పరోక్షంగా ఇరుకున పెట్టేందుకు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.



జూనియర్ ఎన్టీఆర్ కిందటి ఎన్నికల్లో తనదైన శైలిలో విస్తృత ప్రచారం చేసి టిడిపి కి మంచి వ్యక్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొద్దికాలంలోనే వారసుడేవారు అనే విషయం పై ఎన్టీఆర్, లోకేష్ రెండు వర్గాలుగా చీలిపోయి ఆధిపత్యం కోసం వేస్తున్న ప్రణాళికలు,ఎత్తులు, పైఎత్తులు ఆతరువాత జరుగుతున్న పరిణామాలన్ని పాఠకులకు తెలిసినవే. ఈ క్రమంలో బాలకృష్ణ ఇంట్లో జరిగిన పెళ్ళికి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాలేదు.



రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణకు వ్యతిరేకంగా సమైకాంధ్ర నినాదానికి జై కొట్టింది. అదే తరహాలో హరికృష్ణ కూడా సమైకాంధ్ర నినాదాన్ని భుజాన వేసుకొని రాజ్యసభ కు రాజీనామాను సమర్పించారు. హరికృష్ణ రాజీనామా చేస్తున్నట్లు టిడిపి  అధ్యక్షుడికి గాని ...ఆ పార్టీ నేతలెవరికీ తెలియదు. అయితే ఈ విషయం ముందుగానే కృష్ణా జిల్లా వైకాపా నేతలకు తెలియడం విశేషం. విజయవాడ నగరానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఏపీఎన్జీవో నేతలకు ఫోన్ చేసి... హరికృష్ణ రాజీనామా చేయబోతున్నారని... దానిని స్వాగతించాలని కోరారు.



ఈ పరిణామన్నంతా విశ్లేషిస్తే జగన్ చెప్పిన ఆ సంచలన నాయకుడు హరికృష్ణేనేమోనన్న సందేహం కలగకమానదు...ఈ సినిమా క్లైమాక్స్ ఎలా వుండబోతుందో తెలియాలంటే
Wait and Watch TELUGUONE.