Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డబ్బుల్లేవని ఫిట్‌మెంట్ కట్.. ఆదాయం పెరిగిందని యాడ్.. ఇదేంటి జగనన్న?
posted on: Jan 8, 2022 11:09AM
ఐఆర్ 27 ఉంటే.. ఫిట్‌మెంట్ 23 ఇచ్చారు. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తగ్గించడం చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు. ఉద్యోగులు 45శాతం పీఆర్సీ కోరితే.. జగనన్న ఇచ్చింది కేవలం 23శాతం. అంతకుముందు ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి జరిపిన చర్చల్లో నాటకీయ పరిణామాలు జరిగాయని తెలుస్తోంది. ఉద్యోగులను తక్కువ ఫిట్‌మెంట్‌కు ఒప్పించేందుకు.. జగన్ తమ ప్రభుత్వ కష్టాలన్నీ చెప్పుకొచ్చారట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలేమాత్రం బాగా లేదని.. దివాళా అంచులకు చేరిందని వేడుకున్నారట. ఇప్పుడు మీరు అడిగినంత పీఆర్సీ ఇస్తే.. ప్రభుత్వం ఆర్థికంగా పతనం అవుతుందని చెప్పారట. అందుకే, ఇచ్చినంతా తీసుకోమని.. అదే మహాభాగ్యమని పండగ చేసుకోమని ఉద్యోగ సంఘాలతో జగన్ చెప్పారని తెలుస్తోంది. అటుఇటూ తిప్పి.. ఆర్థిక దివాళతనాన్ని సాకుగా చూపించి.. ఎట్టకేలకు 23శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీకి వాళ్లను ఒప్పించారు సీఎం జగన్.
పాపం.. నిజమేననుకున్నారో.. ఇక ఇంతకంటే ఎక్కువ ఇవ్వరని అడ్జస్ట్ అయ్యారో తెలీదు కానీ.. అనేక పెండింగ్ డిమాండ్లతో.. అతితక్కువ ఫిట్‌మెంట్‌తో.. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించేసింది. ఉద్యోగ సంఘాలతో బలవంతపు చప్పట్లు కొట్టించుకుంది.
కట్‌చేస్తే.. కొన్నిగంటల్లోనే ఉద్యోగ సంఘాలను జగన్ ఎంతగా మభ్యపెట్టిందీ బయటపడింది. సరిగ్గా 10 రోజుల క్రితం జగన్ అధికారిక పత్రిక సాక్షిలో తాటికాయంత హెడ్డింగ్‌తో పెద్ద ప్రకటన వచ్చింది. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్-2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్ సొంత ఆదాయం భారీగా పెరిగిందని.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా తగ్గిందనేది ఆ యాడ్ సారాంశం.

మరి ఇదేం డబుల్ గేమ్ జగనన్న అంటున్నారు ఉద్యోగులు. మీ పత్రికలనేమో ఆదాయం పెరిగిందని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకున్నారు.. ఉద్యోగ సంఘాలతో భేటీలో మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందంటూ ముసలి కన్నీళ్లు కార్చారా? అని అనుమానిస్తున్నారు. ఈ రెండింటిలో ఏది నిజం? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు పడటం లేదంటే.. ఖాజానా ఖాళీ అనే విషయం తేలిపోతోంది. మరి, సాక్షి పేపర్‌లో జీజీఐ నివేదిక ప్రకారం ఆదాయం పెరిగిందంటూ గొప్పగా చెప్పుకున్నారు. అంటే.. ఆదాయం పెరగటం నిజమే అయితే.. ఉద్యోగులను అబద్దపు మాటలతో మభ్యపెట్టినట్టేగా అంటున్నారు. మరి, పెరిగిన ఆదాయం అంతా ఏం చేస్తున్నారనే అనుమానం ఇంకోవైపు. లేదంటే.. పెరిగింది గోరంత అయితే చెప్పుకునేది కొండంతనా? అని నిలదీస్తున్నారు. ఇన్‌కమ్ పెరిగితే జీతాలు మరింత పెంచొచ్చుగా? అంటున్నారు. ఇలా.. ఆదాయం..పీఆర్సీతో జగన్‌రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని మండిపడుతున్నారు.






