ప్రైవేటీకరణకు.. పీపీపీకి తేడా తెలియని జగన్.. మంత్రి లోకేష్
posted on Sep 11, 2025 9:41AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అజ్ణానానికి, అవగాహనా రాహిత్యానికీ నిలువెత్తు సాక్ష్యం ఆయన బుధవారం (సెప్టెంబర్ 10) మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలేనని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రైవేటీకరణకు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వా మ్యం(పీపీపీ)కి మధ్య వ్యత్యాసం తెలియదని లోకేష్ అన్నారు. సచివాలయంలో బుధవారం (సెప్టెంబర్ 10)న మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో వైద్య కళాశాలల అభివృద్ధి కోసం తాము పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో వైద్య కళాశాలలకు కనీసం పునాదులు కూడా వేయలేదని ఆయన తెలిపారు.
కానీ ఇప్పుడు జగన్ తన హయాంలో మెడికల్ కాలేజీలు కట్టేశామని గప్పాలు కొట్టుకుంటున్నారని లోకేష్ విమర్శించారు. జగన్ కు అవగాహన లేకపోతే పోయింది.. ఆయన సలహాదారులను అడిగైనా వాస్తవం ఏమిటో ఆయన తెలుసుకుంటే మంచిదని సూచించారు. వైద్యకళాశాలలను పూర్తి చేయడం, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందజేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ అన్నారు.