TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ సత్తా జగన్ కు లేదు.. షర్మిల

Published on: Fri Feb 13, 2026 1:41PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై ఆయన సోదరీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ప్రధాని నరేంద్రమోడీ చేతిలో కీలుబొమ్మలా మారారనీ, బీజేపీని ఎదిరించే సత్తా ఆయనలో లేదనీ అన్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల గురువారం (ఫిబ్రవరి 12) నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆమె మనుబోలు మండలం అక్కంపేటలో బహిరంగ సభలో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే దమ్మూ, సత్తా జగన్ కు లేదన్నారు.

ఇక కేంద్రంలో బీజేపీతో పొత్తుపెట్టుకున్నముఖ్యమంత్రి చంద్రబాబు హోదా మాటే ఎత్తడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్న, రాష్ట్రం బాగుపడాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.  ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలూ కూడా బీజేపీ బినామీలుగా మారిపోయానకి విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని, పథకం పునరుద్ధరణ జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.