కాంగ్రెస్ తో జగన్ దోస్తీ?
Published on: Sat Jan 19, 2013 11:59AM

వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీతో రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పొత్తుకు సిద్దమవుతున్నట్లుగా ఉంది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి వాయలార్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు.
తమకు ప్రధాన ప్రత్యర్ధి బిజెపి తప్ప ఇతర పార్టీలు కాదని వాయలార్ రవి చెప్పడంతో, జగన్ పార్టీ కాంగ్రెస్ తో రాజీకి వచ్చినట్లు అర్థమవుతోంది. జగన్ కొంత కాలం క్రితమే పార్టీ నుంచి బయటకు వెళ్లారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పొత్తుపై రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయిస్తుందని చెప్పడం విశేషం.
ఇతర రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో కూడా కాంగ్రెస్ పొత్తులు ఉన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. దీనిని బట్టి జగన్ తో పొత్తు పై రాష్ట్ర కాంగ్రెస్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందనుకోవచ్చు.


