Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ ఇక ఇంటికి.. టిడిపీ మళ్లీ అధికారంలోకి!
posted on: Jun 21, 2022 1:07PM
రాజకీయ పరిస్థితుల ప్రభావంతో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకోలేకపోవడం స్పష్టంగా కనపడుతోంది. ఏదో అద్భుతాలు చేసి చూపుతాడని ఆశించిన వారికి మూడేళ్ల పాలనతో ప్రజలు తాము చేసిన పొరపాటు గ్రహించుకుంటున్నా రు.
పీఠం ఎక్కినప్పటి నుంచీ అబద్ధాలు, హామీలు నీరుగార్చటం, కేంద్రం ఎదుట సాగిలపడటం తప్ప రాష్ట్రానికి ప్రత్యేకించి వొరగబెట్టిందేమీ లేదన్నది తేటతెల్లమయింది. జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపో యింది. ఇది జగన్ ప్రభుత్వ స్వయంకృతం! దీనికి కర్త కర్మ కూడా ఆయనే! అర్ధంలేని పాలనతో విసిగె త్తిన జనం గతమే బంగారం అనుకుంటున్నారు. అందుకే మళ్లీ తెలుగుదేశం రావాలని గట్టిగా అనుకుం టున్నారు. ఓపిక, సహనం ఎంతో గొప్ప మేలు చేస్తుందన్నది తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో రుజువవుతోంది. అవును ఆయన్ను మళ్లీ పీఠం ఎక్కించాలన్న ధోరణి రాష్ట్రం అంతటా వ్యక్త మవుతోంది.
జగన్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ఎవరూ ఆనందంగా లేరన్నది ప్రతీ సందర్భంలో బయటపడిన వాస్తవం. పథకాలు, సహాయసహకారాలన్నీ కేవలం ప్రచారానికి పరిమితమయ్యాయి. జగన్ మంత్రివర్గం అంటున్నట్టు, అందరికీ సమాన ప్రాధాన్యత అనేది ఎక్కడా లేదు. కేవలం రోజుకో యాప్ ప్రారంభించడం, హడావుడి చేయడం తప్ప ఏవీ ఎవరికీ వుపయోగపడటం లేదన్నది వాస్తవం. కేంద్రానికి వెళ్లిన ప్రతీసారి ఏదో నవ్వుతూ ప్రధాని ముందు చేతులు కట్టుకుని ఆయన చెప్పిన నాలుగు మాటలూ వినడం తప్ప రాష్ట్రానికి రావలసిన వాటి గురించి గట్టిగా నిలదీసిన పాపాన పోలేదు. అసలా ధైర్యం ఎక్కడిది? జగన్ కంటేకేసీఆర్ గట్టివాడన్న మాట ప్రచారంలో వుంది. పక్కనే వున్న మరో తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి గట్టిగానే కేంద్రం మీద విరుచుకుపడుతున్నారు. జగన్‌కి కేసుల వూబి నుంచి బయటపడడానికి సాగిల పడటం తప్ప కేంద్రంతో అమీతుమీ తేల్చుకునే సత్తా ఏమాత్రం లేదు. వుండదు. ఈ పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీ గొప్ప అవకాశాన్ని చేజిక్కించుకుని అధికారంలోకి రావడానికి దారులు వేస్తోంది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ జిల్లాల పర్యటన విజయవంతంగా సాగుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా అనకాపల్లి లో మొదలైన ఆయన పర్యటన చీపురుపల్లిలో సాగిం ది. అయితే చంద్రబాబు సభలకు ప్రజలు భారీగా వస్తున్నారు. చంద్రబాబు ప్రసంగాలకు బ్రహ్మ రథం పడుతున్నారు. దాంతో టీడీపీ కేడర్‌లో ఫుల్ జోష్ నెలకొంది. ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుండగా, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరుగు తోంది. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘‘సామాజిక న్యాయం, సంక్షేమంపై బహిరంగ చర్చకు ప్రతిపక్ష నేత చంద్రబాబు సవాల్ విసిరారు. దీనికి మీరు సిద్ధమైతే వేదిక ఏర్పాటు చేయండి’’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య శుక్ర వారం ట్వీట్ చేశారు. ‘‘బహిరంగ చర్చకు సిద్ధమైతే సమయం తెలియజేయండి. మా పార్టీ తరపున ఇద్దరం వస్తాం. మీ తరపున ఇద్దరు మంత్రులను పంపండి. న్యాయ నిర్ణేతలుగా ఇద్దరు విశ్రాంత ఐఏఎస్ లు వుంటారు. మీరు సిద్ధమా?’’ అని వర్ల రామయ్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు.






