జగన్ కు బెయిల్ నిరాకరణ: నిరుత్సాహంలో వైఎస్ఆర్ కాంగ్రెస్
Published on: Thu Jan 24, 2013 10:24AM
.jpg)
వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. జగన్‌కు బెయిల్ రాకపోవటంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిరుత్సాహంలో మునిగిపోయింది.
సుప్రీం కోర్టు ఆదేశాలు, కేసు విచారణలో ఉన్న కారణంగా జగన్‌కు బెయిల్ ఇవ్వలేమని కోర్టు ఈ రోజు తేల్చి చెప్పింది. ఆస్తుల కేసు దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ తుది ఛార్జీషీటు దాఖలు చేసిన తర్వాతే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. తుది ఛార్జీషీటు వరకు పిటిషన్ దాఖలు చేయవద్దని సుప్రీం కోర్టు సూచించిందని, కేసు విచారణ కొనసాగుతోందని, ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పిన సిబిఐ వాదనలతో హైకోర్టు ఏకీభవించి జగన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.


