Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్.. నీ మద్దతుకో నమస్కారం: బీజేపీ స్పష్టీకరణ
posted on: May 19, 2014 3:43PM
.jpg)
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తానని పిలవని పేరంటానికి వెళ్ళినట్టు ఢిల్లీకి వెళ్ళి మరీ చెప్పిన వైఎస్సార్సీపీ నాయకుడు జగన్‌కి బీజేపీ ఒక పెద్ద నమస్కారం పెట్టేసింది. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ తమ కూటమిలో ఉన్నంత వరకు తమకు ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ అవసరం లేదని బిజెపి సోమవారం స్పష్టం చేసింది. బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ న్యూఢిల్లీలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తమ పార్టీకి, ప్రభుత్వానికి జగన్ మద్దతు అవసరం లేదని మొహమ్మీద కొట్టినట్టు మరీ చెప్పారు. తమ కూటమిలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పారు. ఎన్డీయేలో చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు తమకు మరో పార్టీ అవసరం లేదని తేల్చి చెప్పడంతో జగన్ డల్లయిపోయినట్టు సమాచారం.


.jpg)



