జగన్ పార్టీలోకి మాజీ మంత్రి వసంత

Publish Date:Dec 5, 2012

 

jagan, ysrcongress, ys vijayamma, jagan tdp mlas, jagan congress mlas

 

తెలుగు దేశం పార్టీ నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణా జిల్లా కేడిసిసి బ్యాంకు చైర్మన్ గా ఉన్న వసంత గతంలో ఆప్కాబ్ చైర్మన్ గా కూడా పని చేశారు. జిల్లాలోని నందిగామ మండలం ఇతవరం గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి వసంత జగన్ పార్టీ లో చేరారు. తన కుమారుడు వెంకట కృష్ణ కూడా జగన్ పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


జగన్ పార్టీలో చేరి, వైఎస్ ఋణం తీర్చుకుంటానని వసంత అన్నారు. 1983-84 మధ్య కాలంలో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో వసంత రాష్ట్ర హోం మంత్రిగా పని  చేశారు. అయితే, వసంత జగన్ పార్టీలో చేరికఫై భిన్న కధనాలు వినిపిస్తున్నాయి. విజయవాడ ఎంపి లగడపాటి రాజ్ గోపాల్ తో వైరం వల్ల జగన్ పార్టీలో చేరారా లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.