TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వస్తాడోస్తాడు...సారోస్తాడు...

Published on: Wed Jan 9, 2013 9:26PM

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతీ సభలో, సమావేశంలో తప్పనిసరిగా వినిపించే మాటలు కొన్ని ఉన్నాయి. ‘జగన్ త్వరలోనే బయటికివస్తాడని,’ ‘ప్రజల కష్టాలు తీరుస్తాడని,’ ‘దివంగత నేత వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని మళ్లీ తెస్తాడనే’ అనే మూడు ముఖ్యమయిన వాక్యాలతో ఆపార్టీ నేతల ప్రసంగం మొదలయి, చంద్రబాబుని, కాంగ్రెస్ పార్టీని, సిబిఐని తిట్టడంతో ముగుస్తుంటుంది. చంచల్ గూడా జైల్లోంచి బయటకి రాలేక నానకష్టాలు పడుతున్న జగన్ బయటకొచ్చి ప్రజల కష్టాలు తీరుస్తాడని చెప్పడం ఎవరికయినా నవ్వు తెప్పిస్తుంది. అంతకంటే, జగన్ జైల్లో ఏవిదంగా భాదలు పడుతున్నాడో ప్రజలకి వివరించి చెప్పుకొంటే అతనిపట్ల ప్రజలలోకొంత సానుభూతినయినా ప్రోదిచేసే అవకాశం ఉండేది. గానీ, ప్రతీ సభ, సమావేశంలో ‘వస్తాడోస్తాడు...సారోస్తాడు...’అనే పల్లవి ఎత్తుకోవడం ఆ పార్టీని నవ్వుల పాలు చేస్తుంది తప్ప, ఒరిగేదేమి ఉండదు.

 

ఇక ‘దివంగత నేత వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని మళ్లీ తెస్తాడనే’ అనే వాక్యం వినగానే, ప్రస్తుతము చంచల్ గూడా జైల్లో కిక్కిరిసిఉన్న ఐ.యే.యస్. ఆఫీసర్లు, మంత్రులు, రాజకీయ నాయకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఆడిటర్లూ, కోర్టులు, ఈ.డీ. జప్తులు వగైరావగైరాలన్నీమన కళ్ళముందు సినిమారీలు తిరిగినట్లు గిర్రున ఒకసారిగా తిరిగి, మళ్ళీ మరోసారి రాజన్న రాజ్యం....అదే జగనన్న రాజ్యం వస్తుందంటే ఒళ్ళు జలదరిస్తుంది.

 

ఐ.యే.యస్. ఆఫీసరు శ్రీలక్ష్మి తానూ వ్యక్తిగతంగా తప్పుచేయడం ఇష్టం లేకపోయినప్పటికీ, తానూ రాజన్నరాజ్యంలోఉన్నపాపానికి సమిష్టి తప్పు చేసి ఇలాగ జైలు పాలయేనని బోరున కోర్టులో విలపిస్తుంటే రాజన్నరాజ్యం తడాఖా ఎలాఉంటుందో అర్ధమవుతుంది. అటువంటి రాజన్నరాజ్యం మళ్ళీ అంటే అమ్మో! అంటారు జనం.

 

ఇక చివరిగా చెప్పుకోవలసిన విషయం ఈ రోజు కర్నూలు పట్టణంలో విద్యుత్ సంస్థ సర్కిల్ కార్యాలయం వద్ద విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో  వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు. షరా మాములుగా, ఆమె ముందుగా ప్రజలకు ఆ మూడు పవిత్ర వాక్యాలు చెప్పుకొన్నాక, నేటి సర్వానర్ధాలకి చంద్రబాబు, కిరణ్ కుమారులే కారణమని తిట్టిపోయడంతో సభ ముగించేరు. అదృష్టవశాత్తూ మన రోశయ్యగారు కిరణ్ కుమారూడి చేతికి రాష్జ్త్రం అప్పజెప్పి తెలివిగా చెన్నై చెక్కేశారు. లేకపోతె కిరణ్ కుమారుడి పేరుకు బదులు ఆయన పేరు ఉండే ఆ తిట్లదండకంలో.