అదరగొట్టిన సచిన్..కాళ్లకు దండం పెట్టిన ఓ అభిమాని

 

Jaffer, Tendulkar centuries crush Baroda, Sachin Tendulkar scores ton in Ranji quarterfinal, Sachin Tendulkar hits ton in Ranji Trophy quarters

 

 

వన్డే క్రికెట్ రిటైర్మెంట్ తరువాత క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి ముస్సోరిలో గడిపాడు. అనంతరం ము౦బై తిరిగి వచ్చిన సచిన్ రంజీ మ్యాచ్ లో అదరగొట్టాడు. 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబాయి ను సచిన్, జాఫర్ సెంచరీలతో నిలబెట్టారు. సచిన్ (233 బంతుల్లో 108; 10 ఫోర్లు, 1 సిక్సర్), వసీం జాఫర్ (256 బంతుల్లో 137 బ్యాటింగ్; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. తొలిరోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.


సచిన్‌కు రంజీల్లో ఇది 18వ సెంచరీ కాగా, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 80వది. భారత్ తరఫున గవాస్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల (81) రికార్డుకు సచిన్ మరో సెంచరీ దూరంలో నిలిచాడు.



ముంబయి జట్టు తరఫున ఆడుతున్న సచిన్ ప్రత్యర్థి బరోడా టీం బౌలర్లకు చుక్కలు చూపించాడు. సచిన్ టెండుల్కర్ చేసి పాంలోకి రావడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఓ అభిమాని ఏకంగా స్టేడియం దిశగా దూసుకొచ్చాడు. అయితే అతనిని నిరాశపర్చడం ఇష్టం లేని సచిన్ చేతులు కలిపాడు. దీంతో ఆ అభిమాని సచిన్ కాళ్లకు దండం పెట్టడం విశేషం.