Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జడేజా భార్య రివాబా విజయం
posted on: Dec 8, 2022 2:52PM
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ జడేజా భార్య రివాబా జడేజా బీజేపీ అభ్యర్థిగా నార్త్ జామ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు.
సమీప ప్రత్యర్థిపై దాదాపు 61 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. తన విజయాన్ని ఆమె ప్రజా విజయంగా అభివర్ణించారు. తనకు పోటీ చేసేందుకు అవకాశమిచ్చిన బీజేపీకీ, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు, తనకు మద్దతుగా ప్రచారం చేసిన కార్యకర్తలకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు.
కాగా గుజరాత్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు సాగిన బీజేపీ మరోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమైంది. గట్టి పోటీ ఇస్తాయనుకున్న కాంగ్రెస్, ఆప్ లు చతికిల పడ్డాయి. గుజరాత్ లో బీజేపీ వరుసగా ఏడో సారి అధికారం చేపట్టడానికి రంగం సిద్ధమైంది.



.webp)


