Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ కోసం దీక్ష చేస్తా: స్వామి గౌడ్
posted on: Oct 26, 2011 9:49AM
హైదరాబాద్ :
తెలంగాణ కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. 42 రోజులుగా తెలంగాణ ఉద్యోగులు చేసిన సమ్మె విరమించారని సీమాంధ్ర ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. సమ్మెను విరమించలేదని, తాత్కాలికంగా వాయిదా వేశామని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి ఎప్పుడు పిలిచినా తెలంగాణ ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. టీఎన్జీవో భవన్‌లోజరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమ్మె వల్ల కేంద్ర, రాష్ట్రంలో కదలిక వచ్చిందని, ఇది ఉద్యోగులు సాధించిన తొలి విజయమని ఆయన అన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాని సాధించే బాధ్యత ఉద్యోగులది కాదని, అది రాజకీయంగానే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయనాయకులకు అండగా నిలబడాలనే తాము సమ్మె చేపట్టామని, ఉద్యమంలో ఉద్యోగులది ఉడత సాయమేనని చెప్పారు. ప్రపంచ పోరాటాల్లో ఇలాంటి ఉద్యమం ఎక్కడ కనిపించదని, ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని స్వామిగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవీ ప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు


.jpeg)
.jpeg)


