గవర్నర్‌ను కలిసిన ఐవైఆర్ కృష్ణారావు

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. సోషల్ మీడియాలో తాను షేర్ చేసిన పోస్టులు, తదనంతర పరిణామాలపై ఆయన గవర్నర్‌కు వివరించారు. దీంతో పాటు సోషల్ మీడియాలో కొందరు తనపై అభ్యంతరకర పోస్ట్‌లు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టడం..మిగతా వారు పెట్టిన పోస్ట్‌లను షేర్ చేశారన్న ఆరోపణలపై ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu