Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్రంలో దొరలపాలన నడుస్తోంది... యనమల
posted on: Aug 17, 2022 1:49PM
అధికారంలోకి వచ్చే వరకూ ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, రాష్ట్రంలో దొరలపాలనే నడుస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. బుధవారం (ఆగష్టు 17) ఆయన ఇక్కడ మీడియాతో మాట్లా డుతూ, ఎన్నికలముందు యువతకు అనేక హామీలిచ్చి వారి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక యువత నెత్తిపై జగన్ భస్మాసుర హస్తం పెట్టారన్నారు. 2.30 లక్షల ఉద్యోగాల ఖాళీ ల భర్తీ, జాబ్ క్యాలెం డర్‌పై.. జగన్‌ను నిరుద్యోగులు నిలదీయాలన్నారు. మూడేళ్లలో ఏపీలో పెట్టుబడులు రాకపోగా ఉన్నవీ పోయాయని, జగన్‌కు సీఎం హోదా వచ్చాక ప్రత్యేక హోదాను మరిచారని విమర్శించారు.
గత టీడీపీ పాలనలో యువత తమకు నచ్చిన రంగంలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు 60 శాతం దాకా సబ్సిడీ అందుకునే వారు. డ్రైవింగ్ వృత్తిలో ఉన్న యువతకు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా బ్యాం కు రుణాలు ఇప్పించి ఇన్నోవా కార్లు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పలు రకాల యంత్రాల కొనుగోలు కు సబ్సిడీ ఇచ్చి సహ కారమందించారు. ఒక్కో యువకుడికి రూ.లక్ష నుంచి రూ.20 లక్షల దాకా బ్యాంకు ల ద్వారా రుణసాయం చేశారు. బ్యాంకులు రుణాలివ్వని సందర్భంలో కొంత మందికి ఎన్‌ఎ్‌సఎ్‌ఫడీఎస్, ఎన్‌టీఎ్‌ఫడీఎస్ సహకారంతో నేరుగా ప్రభుత్వమే రుణాలందించింది.
అంతేగాక, ఏటా 50 వేల మంది ఎస్సీ, 5 వేల మంది ఎస్టీ యువత లబ్ధి పొందేవారు. పలు ఐటీడీఏ ప్రాజె క్టుల ద్వారా గిరిజనులకు అభివృద్ధి కార్యక్రమాలు గతంలో నిర్వహించేవారు. గొర్రెలు, బర్రెలు తదితర ఆర్థికాభివృద్ధి యూనిట్లను 90 శాతం సబ్సిడీతో అందించేవారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి వసతిని కూడా కల్పించారు. గిరిజన మత్స్యకారులకు వలలు, సైకిళ్లు, ఆటోలు, పెద్ద వాహనాలను 90 శాతం సబ్సి డీతో అందించారు. ఎస్టీ కార్పొరేషన్, ఐటీడీఏల ద్వారా పేద ఎస్టీ రైతులకు విద్యుత్ సౌకర్యం, బోర్లు, మో టార్లు, పైపులు తదితర సౌకర్యాలు కల్పించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్వయం ఉపాధి పథకానికే స్వస్తి పలికారు. కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యం చేసిన ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీని చంద్రబాబు ప్రభుత్వం పునరు ద్ధరిస్తే... జగన్ సర్కారు వచ్చిన తర్వాత రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్రం ఆ నిధులను నిలి పేసింది.
రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు లేక నవ్యాధ్రంలో నిరుద్యోగాభివృద్ది దిన, దినాభివృద్ది చెందుతోందని యనమల అన్నారు. 75 శాతం పరిశ్రమల్లో స్ధానికులకే ఉద్యోగాలన్న జగన్ రెడ్డి.. కొత్త పరిశ్రమలు, తీసుకు రాగపోగా కమీషన్ల కోసం ఉన్న వాటిని తరిమేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నెలా 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తే.. జగన్ రెడ్డి రద్దు చేసి నిరుద్యోగులకు ద్రోహం చేశారన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరే షన్లు ద్వారా చం ద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తే.. జగన్ రెడ్డి రద్దు చేసి వారి పొట్ట కొట్టా రని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.






