Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రధానికి ప్రాణహాని ప్రచార అస్త్రమా?
posted on: Jan 7, 2022 5:01PM
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా లోపాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సంఘటనపై బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇది ప్రధాని హత్యకు జరిగిన కుట్రగా బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా, భటిండా విమానాశ్రయానికి తిరిగి వచ్చిన తర్వాత, అక్కడున్న పంజాబ్ ప్రభుత్వ అధికారులతో, తాను ‘ప్రాణాలతో’ భటిండా చేరుకున్న విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియచేయాలని కోరినట్లు వార్తలొచ్చాయి. అదెలా, ఉన్నా, బీజీపీ నాయకులు మాత్రం, ఇది ప్రధాని హత్యకు జరిగిన కుట్రగా నమ్మించే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నారు. ఇందుకు సంబందించి దాఖలైన పిటీషన్ పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదలా ఉంటే పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ సహా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదంతా కూడా, ఎన్నికల రాజకీయంలో భాగంగాజరుగతున్న డ్రామాగా వర్ణిస్తున్నారు. ప్రధాని ప్రసంగించవలసిన బహిరంగ సభకు ఆశించిన స్థాయిలో జనం రాలేదని, అందుకే, ప్రధాని వెనక్కి వెళ్ళారని, ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని అటున్నారు. ప్రధానికి ప్రాణహాని లేదని,చన్నీ పేర్కొన్నారు.
అదే విధంగా,రాజకీయ పరిశీలకులు కూడా గతంలోనూ అనేక మార్లు ప్రధాని మోడీ, ఇలాగే, తమ ప్రాణానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, అందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రధాని మోడీ ‘ప్రాణ హాని’ కార్డును ప్రయోగించి, సానుభూతి పొందే ప్రయత్న చేయడం కూడా ఇదే మొదటి సారి కాదని అంటున్నారు. 2017 లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానూ, ప్రధాని మోడీ, ఏకంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్’ పైనే ‘కుట్ర’ ఆరోపణలు చేశారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఆఖరి దశకు చేరుకున్న సమయంలో డిసెంబర్ 10, 2017న ప్రధాని మోడీ, ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణి శంకర్ అయ్యర్ తమ ఢిల్లీ నివాసంలో పాకిస్థాన్ హై కమీషనర్, పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారని, ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి (పేరు చెప్పలేదు) కుడా పాల్గొన్నారని, అదే సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాకిస్థాన్’తో చేతులుకలిపి గుజరాత్ ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఒక్క మోడీనే కాదు, అమిత్ షా, సుభ్రమణ్య స్వామి కూడా మణి శంకర్ నివాసంలో జరిగిన విందు సమావేశంలో మాజీ ప్రధాని సహా, కాంగ్రెస్ నాయకులూ దేశద్రోహానికి పాల్పడ్డారనే అర్థం వచ్చే విధంగా ఆరోపణలు చేశారని పరిశీలకులు అంటున్నారు.
అయితే , మన్మోహన్ సింగ్ ఆ ఆరోపణలను ఆ మర్నాడే (డిసెంబర్ 11) ఖండించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు తాను పాకిస్థాన్’తో కలిసి కుట్ర చేశానని చేసిన ఆరోపణలకు ప్రధాని మోడీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే మణి శంకర్ అయ్యర్ నివాసంలో జరిగిన విందులో తనతో పాటు, పాకిస్థాన్ హై కమీషనర్, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి సహా పలువురు జర్నలిస్టులు ఇతర ప్రముఖులు పాల్గోన్నారని,అందరి పేర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో గుజరాత్ ఎన్నికల ప్రస్తావనే రాలేదని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే మోడీ అసత్య ప్రచారం చేస్తున్నారని మన్మోహన్ సింగ్ అప్పట్లో పేర్కొన్నారు. అయితే ఆ ఎన్నికలలో బీజేపీ ఓడిపోలేదు గెలిచింది. అది వేరే విషయం. కాగా, ఇప్పుడు పంజాబ్ భద్రతా లోపం విషయంలోనూ ప్రధాని మోడీ, ఇతర బీజేపీ నాయకులు, అదే విధంగా పంజాబ్ ఎన్నికల్లో సానుభూతి కోసం అదే ట్రిక్ మళ్ళీ ప్లే చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. నిజానికి, ఇదొక్కటే కాదు, ప్రధాని ఎన్నికల ముందు తనను తను ‘విక్టిమ్’ గా చిత్రించుకుని అసత్య ప్రచారంతో ఎన్నికలలో సానుభూతి ఓటు తెచ్చుకోవడం అలవాటుగా చేసుకున్నారని పరిశీలకు గుర్తు చేస్తున్నారు.
అక్టోబర్ 2013లో .. అక్టోబర్ 27 గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హుంకార్ ర్యాలీపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో ఆరుగురు అమాయకులు చనిపోయారు, కానీ మోడీకి ఏమీ కాలేదు. అయితే, మోడీ శాంతి వచనాలతో, ప్రజామోదం పెంచుకున్నారు. అలాగే, 2015 మే’ నెలలో...పండిట్ దీనదయాళ్ పూర్వికుల గ్రామంలో మోడీ ప్రభుత్వ ప్రధమ వర్షికోత్సవ సభలో, ప్రారంభానికి ముందు, వేదికను పెల్చివేస్తున్నామని వచ్చిన వాట్సప్ మెసేజ్ కలకలం సృష్టించింది. అయితే చివరకు అది మతి స్థిమితం లేని వ్యక్తి పంపిన మెసేజ్’గా పోలీసులు నిర్ధారించారు. మెసేజ్ పంపిన వ్యక్తి సోదరుని అరెస్ట్ చేసి విచారించారు. అలాగే ..2017 ఫిబ్రవరిలో ... ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, మావూ జిల్లాలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో, పోలీసు అధికారి ఒకరు, మోడీ ప్రాణికి ముప్పు పొంచి ఉందని, అన్నారు. హరేన్ పాండే (గుజరాత్ మాజీ మంత్రి) హత్య కేసులో ముద్దాయి రసూల్ పతి, ప్రధాని కాన్వాయ్’ని రాకెట్ లాంచర్’ తో పేల్చి వేసేందుకు ప్లాన్ చేశారని ఏఎస్పీ ఆర్కే సింగ్ పేర్కొన్నారు. అయినా. మోడీ ర్యాలీలో పాల్గొన్నారు. వెనక్కి తిరిగి వెళ్ళలేదు.
అలాగే, 2017లో కేరళలో కొచ్చి మెట్రో రైల్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా ఉగ్రవాదులు మోడీకి ప్రాణ హాని తలపెట్టారని, ఆ రాష్ట్ర డీజీపీ టీపీ సేన్ కుమార్ తర్వాత ఎప్పుడో ప్రకటించారు. ఇక మాలెగావ్ కేసుగా ప్రసిద్ధి చెందిన, విప్లవ రచయితల సంఘం నాయకుడు వరవర రావు సహా ఐదుగురు మావోయిస్టు సానుభూతి పరులు సంవత్సరాలుగా జైలులో మగ్గుతున్న కేసు సంగతి చెప్పనే అక్కరలేదు. ఒక లేఖ ఆధారంగా మావోయిస్టులు మోడీని కూడా రాజీవ్ గాంధీని హతమార్చిన విధంగానే హతమా ర్చేందుకు కుట్ర చేశారనే ఆరోపణపై ఈ ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఇలా అనేక సందర్భాలలో మోడీ హత్యకు కుట్ర, ప్రాణ భయం చర్చకు వస్తునే వుంది. అయితే ఇవ్వన్నీ నిరాధారమని నిర్దారించలేములేమని, అలాగని నిజమని అనుకునే పూర్తి ఆధారాలు లేవని పరిశీలకులు అంటున్నారు.


.webp)
.webp)


