హుజురాబాద్ లో ఈవీఎంలు మార్చేశారా? బస్సు నుంచి కారులోకి వీవీ ప్యాడులు..

posted on: Oct 31, 2021 9:03AM

తెలంగాణలో రాజకీయ కాక రాజేసిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసినా హీట్ మాత్రం చల్లారడం లేదు. పోలింగ్ ముగిసాకా ఈవీఎమ్ లను స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తుండగా... జరిగిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. నడిరోడ్డు పై ఓ వ్యక్తి వీవీ ప్యాడ్ లు కారులోకి మార్చిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సరైన సెక్యూర్టీ లేకుండా ఈవీఎంలు, వీవీ ప్యాడ్స్ తరలిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈవీఎంలు భద్రపరస్తున్న కరీంనగర్ లోని ఎస్ ఆర్ఆర్ కళాశాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు వాహనాన్ని అడ్డుకున్నాయి. ఈ వీఎంను ఆర్టీసీ బస్సుల కాకుండా ప్రైవేటు బస్సులో తరలించడంపై పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోడ్డుపై వీవీ ప్యాడ్ తరలించిన వ్యక్తిని నిలదీశారు. అయితే పోలీసులే సదురు వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నిందితున్ని తప్పించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీస్ పహారా లేకుండా, అధికారుల పర్యవేక్షణ లేకుండా ఎలా వీవీ ప్యాడ్ లు తరలిస్తారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలు తరలించే వాహనాలను అకారణంగా ఆపారంటూ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి సమగ్ర విచారణ జరిపి కలెక్టర్ సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన, విధులు నిర్వర్తించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...