Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పంజాబ్ లో బీజేపీ చేతులెత్తేసిందా! ప్రధాని పర్యటనే సాక్ష్యమా?
posted on: Jan 6, 2022 1:14PM
పంజాబ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ ను నిరసనకారులు అడ్డుకోవడం సంచనమైంది. నిరసనతో ఏకంగా తన సభను రద్దు చేసుకుని తిరిగి వెళ్లిపోయారు నరేంద్ర మోడీ. అంతేకాదు క్షేమంగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నాను.. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. పంజాబ్ లో ప్రధానికి ఎదురైన ఘటన దేశంలో ప్రకంపనలు స్పష్టిస్తోంది. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో రాజకీయంగా రకరకాల చర్చలు సాగుతున్నాయి.
నరేంద్ర మోడీ తాజా వ్యవహారాన్ని రెండు రకాలుగా చూడవచ్చంటున్నారు. అందులో మొదటిది సెక్యూరిటీ ల్యాప్స్ గా. ఇక రెండోది రాజకీయం. భద్రతా వైఫల్యాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్ గా తీసుకుంది. రాజకీయంగా చూస్తే.. తాజా ఘటన పంజాబ్ లో బీజేపీ పరిస్థితికి అద్దం పడుతున్నట్లు ఉందని చెబుతున్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ కూడా ఉంది. ఇపుడు పంజాబ్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న దారిలో ఓ ఫ్లైవర్ దగ్గర రైతులు వాహనాలను అడ్డంపెట్టి నిరసన తెలపడం బీజేపీకి షాకే.
మూడు వ్యవసాయ చట్టాలు చేయటంతోనే మోడీ సర్కార్ పై రైతుల్లో ఆందోళన మొదలైంది. పంజాబ్ లో మొదలైన ఆందోళన చివరకు దేశవ్యాప్తమైంది. రైతుల పోరాటానికి దిగొచ్చి వ్యవసాయ చట్టాలను మోడీ సర్కార్ ఉపసంహరించుకుంది. అయితే ఈమధ్య కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ నిప్పు రాజుకుంది. వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసుకోగానే రైతులు కూడా ఉద్యమానికి స్వస్తిచెప్పి ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటిది తోమర్ మాట్లాడుతు తొందరలోనే రద్దుచేసిన వ్యవసాయ చట్టాలను మళ్ళీ తెస్తామని చెప్పారు. దాంతో ఒక్కసారిగా రైతు సంఘాల్లో వ్యతిరేకత మొదలైపోయింది. తర్వాత తన మాటలను వక్రీకరించారని కేంద్రమంత్రి చెప్పినా... అప్పటికే జరగాల్సిన నష్టం బీజేపీకి జరిగిపోయింది.
తోమర్ వ్యాఖ్యల తర్వాత మోడి పంజాబ్ పర్యటనకు వచ్చారు. దాంతో రైతులు మోడికి నిరసన సెగ ఎలాగుంటుందో చూపించారు. అంటే ఇదే విధానం రేపటి ఎన్నికల్లో కూడా కంటిన్యు అవుతుందని చెప్పకనే చెప్పినట్లయ్యింది. పంజాబ్ లో రైతులను కాదని ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అసలే పంజాబ్ లో బీజేపీ పరిస్ధితి అంతంత మాత్రంగా ఉంది. జరిగిన ప్రీపోల్ సర్వేల్లో దేనిలో కూడా బీజేపీ అధికారంలోకి కాదు కదా కనీసం పోటీ ఇస్తుందని కూడా కూడా రాలేదు.ఇలాంటి స్ధితిలో పార్టీ పరిస్దితిని చక్కదిద్దుదామని మోడి ప్రయత్నించినట్లున్నారు. పంజాబ్ లో కార్యక్రమం పెట్టుకోవటం ద్వారా జనాలను ఆకట్టుకోవచ్చని అనుకున్నట్లున్నారు. కానీ మధ్యలో రైతుల ఆగ్రహానికి గురై చివరకు కార్యక్రమాన్నే రద్దు చేసుకోవాల్సొచ్చింది. ప్రధానమంత్రి కార్యక్రమాన్నే రైతులు అడ్డుకున్నారంటే ఇక మిగిలిన నేతల పరిస్ధితి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. రేపటి ఎన్నికల్లో బీజేపీ పరిస్ధితి ఏమిటనేందుకు ఇదే తాజా ఉదాహరణ అంటున్నారు. పంజాబ్ లో బీజేపీకి చేతులెత్తేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


.webp)



