Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కశ్మీర్‌కు ఆజాదీ!.. ఆరెస్సెస్ అధినేత క్లారిటీ...
posted on: Oct 17, 2021 12:05PM
ఆర్టికల్ 370 రద్దు. రాజ్యాంగంలో జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేకంగా కల్పించిన హక్కులను రద్దు చేసింది. అప్పటి నుంచీ దేశంలోని మిగతా రాష్ట్రాల మాదిరే కశ్మీర్ కూడా. వేరే ప్రత్యేకతలు, మినహాయింపులు ఏవీ ఉండవు. మరి, ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ-కశ్మీర్ సమస్యలన్నీ తీరిపోయాయా? కశ్మీర్‌లో అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయా? ఆజాదీ డిమాండ్ అంతరించిపోయిందా? ఇలా అనేక ప్రశ్నలకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర అభిప్రాయాలు చెప్పారు.
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన అధికరణం 370 రద్దుతో సమస్య మొత్తం తొలగిపోలేదని, ఇప్పటికీ స్వాతంత్య్రం (ఆజాదీ) గురించి మాట్లాడుతున్న వారు భారత్‌లో కలిసిపోతేనే పరిష్కారం లభిస్తుందని ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. ‘ఆజాదీ కోరుకుంటున్న వారూ మన దేశంలో విలీనమయ్యేలా సమాజం చొరవతీసుకోవాలి. గత నెలలో ముంబైకి వచ్చిన జమ్మూకశ్మీర్ ముస్లిం విద్యార్థులు భారత్‌లో తామూ ఓ భాగం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అందుకు వారికి ఎలాంటి అవరోధాలు ఉండబోవు’ అని భగవత్ చెప్పారు.
‘తమ చిన్నారుల చేతుల్లో పుస్తకాలకు బదులు రాళ్లు పెట్టిన తల్లిదండ్రులు ఇప్పుడు ఉగ్రవాదులను కీర్తించడం మానేశారు. పాకిస్థాన్ ద్వారా ప్రేరణ పొందుతున్న వారు, మనసులో మతతత్వ భావనలు ఉన్న వారే ఆజాదీ డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వారు ఇంకా కొందరున్నారు. భారత్‌లో వారిని విలీనం చేసేలా మన ప్రయత్నాలను ముమ్మరం చెయ్యాలి’ అని మోహన్ భగవత్ పిలుపిచ్చారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, ఇటీవల తన పర్యటనలో ఆ విషయాన్ని గమనించానని ఆరెస్సెస్ చీఫ్ అన్నారు. ‘గతంలో జమ్మూ, లద్దాక్ ప్రాంతాలు తీవ్ర వివక్షకు గురయ్యాయి. 80శాతం ఆర్థిక వనరులు కశ్మీర్ స్థానిక నాయకుల జేబుల్లోకే వెళ్లేవి. ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడంతో ప్రజలు వారిని గురించి ఆందోళన చెందడంలేదు’ అంటూ భగవత్ చెప్పుకొచ్చారు.
అరెస్సెస్ అధినేత మాటలను బట్టి.. ఇప్పటికీ కశ్మీర్‌లో ఆజాదీ డిమాండ్ సజీవంగానే ఉందనే భావన కలుగుతోంది. ఉగ్రవాద భయం తగ్గిందని.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, కశ్మీరీ ముస్లింలు ఇంకా పూర్తి స్థాయిలో భారత్‌లో తాము భాగం కాలేదని.. కావాలని కోరుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.


.jpg)



