ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు

posted on: Feb 23, 2026 9:21AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియాల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. జగన్ హయాంలో అప్పటి ఎంపీ రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను పోలీసులు బీహార్ లో అరెస్టు చేశారు.

జగన్ హయాంలో  బీహార్ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి డిప్యూటేషన్ పై ఏపీ సీఐడీలో పని చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సునీల్ నాయక్ తిరిగి సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. అయితే అప్పట్లో కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ పాత్రపై పిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బీహార్ వెళ్లి మరీ అతడిని అదుపులోనికి తీసుకుని ఏపీకి తరలించారు. సోమవారం (ఫిబ్రవరి 23) సునీల్ నాయక్ ను విచారించి కోర్టులో హాజరు పరిచే అవకాశలున్నాయి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...