TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాలోనూ ఐపీఎల్ తరహాలో టి20 లీగ్- క్రికెట్ ఫీవర్ తో ఊగిపోనున్న అగ్రరాజ్యం

Published on: Sat May 21, 2022 7:54AM

భారత్ లో క్రికెట్ ఒక మతం.. క్రికెటర్లను అభిమానులు దేవుళ్లతో సమానంగా కొలుస్తారనడానికి క్రికెట్ దేవుడంటూ సచిన్ కు ఒక ట్యాగ్ తగిలించేయడమే నిదర్శనం. అలాంటి క్రికెట్ ఇప్పుడు అమెరికాలోనూ అడుగిడుతోంది. క్రికెట్ ఫీవర్ తో అమెరికన్లు ఊగిపోయే రోజు మరెంతో దూరంలో లేదు. అమెరికాలో కూడా ఐపీఎల్ తరహాలో టి20 క్రికెట్ లీగ్ ప్రారంభం  కాబోతోంది. ఇందుకు మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ సత్య నాదెళ్ల ముందుకు వచ్చారు.

ఆయన ప్రధాన ఇన్వెస్టర్ గా, పలు దిగ్గజ కంపెనీల యజమానులు, సీఈవోలు ముందుకు వచ్చి క్రికెట్ ఫీవర్ ను ఎలాగైన అమెరికకు అంటించాలని కంకణం కట్టుకున్నారు.అమెరికాలో  ప్రపంచ స్థాయి  టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం కోసం  ఏ అండ్‌ ఏ1 ఫండ్‌ రైజింగ్‌ పేరుతో నిధుల సమీకరణ చేపట్టారు. సల్వ వ్యవధిలోనే 44మిలియన్ డాలర్లను  సమీకరించారు. మరో ఏడాదిలోగా దీనిని  76మిలియన్ డాలర్లకు చేర్చాలన్నది లక్ష్యం. మొత్తం  120మిలియన్‌  డాలర్లను ఫండ్‌ను సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ కు సత్యా నాదెళ్ల లీడింగ్ రోల్ పోషిస్తున్నారు. 

 పెట్టుబడిదారుల్లో సత్య నాదెళ్లతో పాటుగా శంతను నాయణ్, మాడ్రోనా వెంచర్ గ్రూప్ ఎండీ సోమ సేగర్, మిల్లివేస్ వెంచర్స్ అండ్ రాకెట్‌షిప్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ రాజారమణ్, వెంకీ హరినారాయణ్, ఇన్ఫినిటీ కంప్యూటర్ సొల్యూషన్స్ ఛైర్మన్ జైతర్ సంజయ్ గోవిల్, మేనేజింగ్ పార్టన్ పెరోట్ జైన్ తదితరులు ఉన్నారు. ప్రపంచ స్థాయి క్రికెట్ టోర్నీ నిర్వహణతో పాటు అమెరికాలో క్రికెట్ మార్కెటింగ్ నూ పెంచడం లక్ష్యమని సత్యానాదెళ్ల తెలిపారు.