ఇంటర్వ్యూ మేడ్ ఈజీ...

చాలా మంది ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి, వాటిని ఫేస్ చేయడానికి చాలా కంగారు పడుతుంటారు. అలాంటివారు ఈ క్రింద సూచనలను పాటించినట్లయితే విజయం సాధించవచ్చు. ఇంటర్వ్యూలలో సక్సెస్ కావడానికి ఎన్నో స్కిల్స్ వున్నాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.

 

బయోగ్రఫీ చెప్పొద్దు...

ఇంటర్వ్యూలో తరచుగా మన బయోడేటాకు సంబంధిన ప్రశ్న అడుగుతుంటారు అలాంటప్పుడు చాలామంది వెంటనే తమ బయోగ్రఫీ గురించి చెప్పుకొంటూ పోతారు. కాని అ విధంగా చెప్పడం సరైన పద్ధతికాదు. ఒక రిక్రూటర్ అభ్యర్థి మాట తీరును చూస్తాడు. అభ్యర్థికి పనిచేసే సామరథ్యం ఎంత ఉందో చూస్తాడే తప్ప ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఎంత కష్టపడి పైకి వచ్చిందీ చూడడు.  అందుకే
ఇంటర్వూలో పర్సనల్ హిస్టరీ గురించి ఎప్పుడు చెప్పకూడదు.

 

స్కిల్స్ ఏమిటో స్పష్టంగా చెప్పాలి..

ఇంటర్వ్యూకి వెళ్ళిన అభ్యర్థులు ఆ జాబ్‌కు తాము ఎలా న్యాయం చేయగలమో స్పష్టంగా చెప్పాలి. అందుకు తగ్గ స్కిల్స్ తమ దగ్గర ఏమున్నాయో వివరించాలి. అలా వివరించే సమయంలో స్పష్టత తప్పనిసరి. ముందు జాబ్ కు సంబంధించిన స్కిల్స్ చెప్పాలి. అవసరమైతే ఎవిడెన్స్ రూపంలో చూపించవచ్చు.

 

సూటిగా చూడాలి...

ఇంటర్వ్యూ చేసే వ్యక్తులను సూటిగా చూడాలి. మన కళ్ళలో సూటితనమే వారిలో వున్న ఎన్నో ప్రశ్నలకు చెప్పకుండానే సమాధానాలు చెప్పేస్తాయి.

 

బలహీనతలు ఒప్పుకోండి...

రిక్రూటర్‌కు చెప్పే బలహీనతలు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నిజాయితీగా మన బలహీనతలు ఒప్పుకోవాలి. మీరు ఏ పనులైతే చేయలేరో, ఏయే విషయాలలో మీకు స్కిల్ లేదో స్పష్టంగా చెప్పేయాలి. లేని స్కిల్స్‌ ఉన్నాయని చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. లేని విషయాలు చెబితే వాటిని రిక్రూటర్ పట్టేస్తాడు. దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగితే దొరికిపోయే ప్రమాదం వుంది. అయినా శుభమా అంటూ ఒక ఉద్యోగంలో చేరుతూ మొదటి స్టెప్‌లోనే అబద్ధాలు చెప్పడం వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండీ?

 

సాగదీయొద్దు...

సమాధానాలు చెప్పేటప్పుడు దాన్ని సాగదీయొద్దు. ఏ విషయాన్నయినా సూటిగా, స్పష్టంగా, సుత్తిలేకుండా చెప్పండి.. ఇక ఉద్యోగం మీదే.. నో డౌట్.. ఆల్ ద బెస్ట్..