Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సమాజ నిర్మాణంలో మహిళల పాత్రే కీలకం : సీఎం చంద్రబాబు
posted on: Mar 8, 2026 3:37PM
.webp)
అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు తెలుగు మహిళలు ఏ పని తలపెట్టిన లక్ష్యాన్ని సాధించే వరకు వదిపెట్టరని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళలు సమాజం నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆయన కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోవాలని వారికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నేత ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలు బాగా చదువుకోవాలని ప్రత్యేక విశ్వవిద్యాలయం తెచ్చారని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఇప్పటికే లక్ష దాటారు. తీసుకున్న రుణాలను సమయానికి బ్యాంకులకు చెల్లిస్తున్నారు.
అప్పులు ఇప్పించే బాధ్యత తనదని సద్వినియోగం చేసుకోవాల్సింది మీరేనని ముఖ్యమంత్రి అన్నారు. మీరు తయారు చేసి వస్తువులు మీరే వాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాదిలో మరో 5లక్షల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఇంట్లో స్వయం బ్రాండ్ ఉత్పత్తులే వాడాలి అని చంద్రబాబు తెలిపారు.
డ్వాక్రా, మెప్మాలో ప్రస్తుతం 1.1 కోట్ల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులు దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. తమ ఇంట్లో కూడా ఇద్దరు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని, తన భార్య, కోడలు సమర్థంగా వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి ఇంట్లోనూ ఒక మహిళా వ్యాపారవేత్త ఉండాలని సూచించారు.
ఆడబిడ్డల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. దుర్మార్గులను అరికట్టాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందన్నారు. మహిళల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఆరోగ్యం విషయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంట్లో ఎవరికీ వ్యాధులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మహిళలదేనని పేర్కొన్నారు.
సమాజంలో వస్తున్న మార్పుల వల్ల జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా తగ్గితే అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. పెద్ద కుటుంబం ఉంటే రక్షణ, భద్రత, ఆనందం కలుగుతాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలు పెద్ద కుటుంబాలకు కూడా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం 58 శాతం మంది ఒక్క బిడ్డకే పరిమితం అవుతున్నారని పేర్కొన్నారు.


.webp)



