వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మరణం

posted on: Mar 6, 2013 9:34AM

58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కరాకాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చావెజ్ మంగళవారం (05.03.2013) 4.25 గంటలకు కన్నుమూశారు. 1954 జులై 28న జన్మించిన ఆయన 14 సంవత్సరాలుగా వెనుజులా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వెనిజులాలోని చమురు గనులకు ప్రసిద్ధి. చావెజ్ చమురు వ్యాపారంలో వచ్చిన డబ్బుతో అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి వెనిజులాలో పేదరికం లేకుండా చేశారు. చావెజ్ కు క్యూబాలో ఇంతకుముందు నాలుగుసార్లు కేన్సర్ వ్యాధికి కెమో థెరపీ చికిత్స చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...