ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుడు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్
posted on Sep 6, 2025 12:05PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.
ఈ నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎంపీగా తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి మధ్యంతర బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ విచారించిన ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశిస్తూ మిథున్ రెడ్డికి ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తూ మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.