Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కొట్టు సత్యనారాయణని తరిమికొట్టిన ఉద్యోగులు!
posted on: May 9, 2024 11:52AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎవరో తెలుసా? చెప్పలేరు.. ఎందుకంటే జగన్ మంత్రివర్గంలో ఉనికి, గుర్తింపు లేని అనేకమంది మంత్రులలో ఆయన కూడా ఒకరు. కొట్టు సత్యనారాయణ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు. ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అవినీతి, అక్రమ సంపాదన విషయంలో అగ్రనేతకే పాఠాలు చెప్పగల స్థాయికి చేరుకున్న కొట్టు సత్యనారాయణ ఈసారి ఎన్నికలలో కన్ఫమ్‌గా ఓడిపోయే ఎమ్మెల్యేలలో ఒకరు.
గురువారం నాడు తాడేపల్లిగూడెంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఇంతలో కొట్టు సత్యనారాయణ అక్కడకి వచ్చారు. పోలింగ్ బూత్ దగ్గరకి వెళ్ళే ప్రయత్నం చేశారు. దాంతో ఉద్యోగులు ఆయన్ని ఆపారు. ఒక అభ్యర్థి అయిన మీరు ఇక్కడకి రావడం కరెక్ట్ కాదన్నారు. దాంతో కొట్టు సత్యనారాయణ అహం దెబ్బతింది ‘అందర్నీ లోపల వేయించేస్తాను’ అని నోరు జారారు. దాంతో ఉద్యోగులు ఒక్కసారిగా కొట్టు సత్యనారాయణ మీద విరుచుకుపడ్డారు. దాంతో కొట్టు సత్యనారాయణ అక్కడ నుంచి బయటకి వచ్చేశారు. బయటకి వచ్చిన కొట్టుకు ఏం మాట్లాడాలో అర్థం కాక, అక్కడే వున్న హిందీ పోలీసులతో ‘మై హిందీ బాత్ కర్తాహూ’ అని వచ్చీ రాని పిచ్చి హిందీ మాట్లాడారు. అక్కడ నుంచి వెళ్ళిపోకుండా అక్కడే వున్న కొట్టు మీద ఉద్యోగులు విరుచుకుపడ్డారు. ‘లోపల వేయిస్తావా.. మీ పని అయిపోయింది.. పో ఇక్కడ నుంచి అని కసిరారు’ దాంతో చెమటలు పట్టిన కొట్టు సత్యనారాయణ అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. మొత్తమ్మీద కొట్టు సత్యనారాయణ అదృష్టవంతుడు అని చెప్పాలి. ఎందుకంటే, ఆగ్రహంగా వున్న ఉద్యోగుల చేత కొట్టించుకోకుండా బయటపడ్డారు.






