'ఇంద్ర'ను ప్రారంభించిన మంత్రులు బొత్స, ఆనం

posted on: Oct 25, 2011 3:59PM

హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఇంద్ర బస్సులను ప్రారంభించారు. సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్‌లో వోల్వో బస్సుల స్థానంలో వచ్చిన మూడు వందల ఇంద్ర బస్సులకు, సిఎన్జీ బస్సులకు ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు. ఆర్టీసికి ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయల గ్రాంట్ ప్రకటించిందని ఇప్పటికే రూ.వంద కోట్లు ఇచ్చిందని మిగిలిన మొత్తం మార్చిలోగా ఇస్తుందని చెప్పారు. ప్రతి నెల 300 కొత్త బస్సుల చొప్పున రెండేళ్లలో ఆరువేల ఇంద్ర బస్సులు ప్రవేశ పెడతామని చెప్పారు. ఆర్టీసి ఉద్యోగులను నిబంధనల ప్రకారం రెగ్యులైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని త్వరలో ఈ ప్రక్రియ పూర్తి కావొస్తుందన్నారు.ఈ  కార్యక్రమంలో ఆర్టీసి చైర్మన్ ఎం. సత్యనారాయణ రావు పాల్గొన్నారు. కాగా ఇంద్ర బస్సులు రాజధాని నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకు సామాన్య ప్రయాణీకుల సౌకర్యార్థం కొత్తగా తీసుకు వచ్చారు. ఎసి వంటి వసతులు కలిగిన ఇంద్ర బస్సు ఛార్జీలు గరుడ కంటే తక్కువగా ఉండే అవకాశముంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...