నన్ను గెలిపిస్తే..  ఓటర్లని మూన్ పైకి..  

posted on: Mar 24, 2021 4:29PM

ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టడానికి రాజకీయ నాయకులూ చేసే ప్రయత్నం అంత ఇంత కాదు. మీ కులానికి ఏది చేస్తాను అని ఒక నాయకుడు అంటే, మరో పార్టీ నాయకుడు ఈ మతాన్ని దేశంలో లేకుండా చేస్తాను అని చేస్తుంటారు. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో తనను గెలిపిస్తే హైదరాబాద్ కి  ఓడరేవు తెపిస్తాను అని నటుడు శ్రీకాంత్  చెప్పినట్లు. ప్రస్తుతం ఎన్నికల్లో అలాంటి హామీలను తనదాన్నేలా పోటీపడ్డారు ఒక స్వతంత్ర అభ్యర్థి. ఇంతకీ ఆ ఘనుడు ఎవరని అనుకుంటున్నారా.. మీరే చూడండి.. 

సమయంలో ఓటర్లను ఆకట్టుకునే హామీలు ఇవ్వడంలో తమిళనాడుకు మరే రాష్ట్రం సాటిరాదు. ఊహించని విధంగా ఉచితాలు ఇవ్వడం తమిళనాడులోనే ప్రారంభమైందనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మధురై నుంచి పోటీ  చేస్తున్న శరవణన్ అనే స్వతంత్ర అభ్యర్థి ఇచ్చిన హామీకి అందరూ ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ఇది ఆషామాషీ హామీ కాదు. తనను ఎన్నికలలో గెలిపిస్తే తన నియోజకవర్గ ప్రజలను విడతల వారీగా చంద్రమండలానికి తీసుకువెళతాను అని హామీ ఇస్తూ పెద్ద సాహసమే చేశాడు ఆ అభ్యర్థి. అంతేకాదు, దీనికి సంబంధించిన కార్యాచరణ గురించి కూడా క్లియర్ గా చెప్పాడు. చంద్రమండలంకు తీసుకెళ్లేందుకు మధురై సమీపంలో ఒక రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన చెబుతున్నాడు. అంతేకాదండోయ్... ఇంట్లో ఆడవాళ్ళ శ్రమను గుర్తించిన ఆయన ఆడవారికి వారి పనులకు సాయం చేసేందుకు ప్రతి ఇంటికి ఒక రోబోను కూడా ఇస్తానని మరో హామీ ఇచ్చాడు. అలా వైకుంఠ పురం సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్లు పెద్ద బ్యారమే ఇది..అన్నట్లు ఈ అభ్యర్థిది పెద్ద గుండెనే.. ఆయన హామీలకు నియోజకవర్గంలోని ఓటర్లు కూడా షాక్ కు గురవుతున్నారట. మరి, ఈ స్థాయిలో హామీలిచ్చిన ఈయనకు ఏమేరకు ఓట్లేస్తారో చూడాలి! 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...