TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్రికెట్ ఉమన్ టీమ్‌ ఇండియాకి షాక్!

Published on: Sat Oct 5, 2024 3:12PM

టి20 మహిళల వరల్డ్ కప్‌లో భారత జట్టుకు తొలి మ్యాచ్‌లోనే పరాజయం ఎదురైంది. ఈసారి ఎలాగైనా కప్ సాధించాలన్న లక్ష్యంతో టోర్నీలో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైంది.  ఈ మ్యాచ్‌లో తొలుత  బ్యాటింగ్ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 160 ప‌రుగులు చేసింది. 161 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన టీం ఇండియా 19 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 58 ర‌న్స్ తేడాతో భార‌త జ‌ట్టు ఓడిపోయింది.