TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫోన్ మాట్లాడుతూ కింద పడి..

Published on: Thu Apr 2, 2015 12:48PM

 

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారత్ కు చెందిన పంకజ్ షా అనే ఐటీ ఉద్యోగి ప్రమాదవశాత్తూ మరణించాడు. గురువారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకొంది. పంకజ్ షా ఇండియాలో ఉన్న తన భార్యతో ఫోన్ మాట్లాడుతూ అతను ఉంటున్న అపార్ట్మెంటు మూడవ అంతస్తు బాల్కనీలోంచి జారి కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు తీవ్రమైన గాయం, మరికొన్ని అంతర్గత గాయాలవల్ల పంకజ్ షా మరణించాడని వైద్య బృందం తెలిపింది. పంకజ్ షా నార్త్ సిడ్నీలోని ఐటి సంస్ధలో సిస్టం అనలిస్ట్గ్ గా పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే పంకజ్ షా వివాహం చేసుకొని ఆస్ట్రేలియాకు వచ్చినట్టు సంస్ధ మేనేజర్ కరేన్ వాలర్ తెలిపారు.