Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారత రక్షణ రంగంలో మరో యాంటి సబ్ మెరైన్ యుద్ధ నౌక
posted on: Oct 6, 2025 8:38PM

భారత రక్షణ రంగంలో మరో శక్తివంతమైన యుద్ధనౌక చేరింది. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ యద్ద నౌక శత్రు దేశాల సబ్ మెరైన్లను సమర్ధవంతంగా ఎదుర్కోగల సాంకేతిక సామర్థ్యంతో రూపొందించారు . వార్ ఫేర్ సబ్మెరైన్ హంటర్ వాటర్ క్రాఫ్ట్ సిరీస్ రెండు తరహా కు చెందిన ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనే ఈ యుద్ధ నౌకను తూర్పు నౌకాదళ కేంద్రం విశాఖలో ప్రారంభించడం జరిగింది.
తూర్పునౌకదల ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెన్దర్కర్ సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 77 మీటర్ల పొడవు 1500 బరువుతో రూపొందించిన ఈ యాంటి సబ్మెరైన్ షిప్ కు లక్షద్వీప్ లోని ఒక ఐలాండ్ పేరు ఆండ్రోత్ గా పెట్టారు. ఈ యుద్ధనౌక జల ప్రవేశంతో తూర్పు తీరంతో పాటు భారత రక్షణ రంగం మరింత సమర్థవంతంగా మారినట్టు అయింది






