భార‌త్ వారెన్ బఫెట్  రాకేష్ జున్‌జున్‌వాలా మృతి

posted on: Aug 14, 2022 10:09AM

బిలియనీర్, బిజినెస్ మ్యాగ్నెట్, స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(62) మృతి చెందారు.  ఆయన ముంబైలో ఆదివారం (ఆగ‌ష్టు 14) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యలతో కొద్ది రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అనంతరం రెండు వారాల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో ఆయనను ఈ రోజు ఉదయం మరోసారి ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
ట్రేడర్‌గా చార్టెడ్‌ అకౌంటెంట్‌గా ఆయన ఎంతో పేరుగడించారు. భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకరిగా నిలిచారు.
ఇటీవలే ఈ వైమానిక సంస్థ సేవలను ప్రారంభించింది. మొదటి విమానం ముంబై నుంచి అహ్మదాబాద్ ప్రయాణించింది. రాకేశ్ ను ‘బిగ్ బుల్’, ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తుంటారు. ఆయన వ్యాపార చిట్కాల ద్వారా ఈ పేర్లు అందుకు న్నారు. 

రాకేశ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రపంచానికి ఆయన చెరగని సహకారాన్ని అందించారంటూ కొనియాడారు. దేశ పురోగతికి కృషి చేశాడన్నారు. ఆయన మృతి బాధాకరమన్నారు. రాకేశ్ కుటుంబ సభ్యులకు, అభిమా నులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మోదీ.

google-ad-img
    Related Sigment News
    • Loading...