తాలిబాన్ల చేతిలో భారతీయ రచయిత్రి హత్య

posted on: Sep 6, 2013 10:50AM

 

ఆప్ఘనిస్థాన్ లో భారత రచయిత్రి సుష్మితా బెనర్జీని తాలిబన్లు దారుణంగా కాల్చి చంపారు. పక్తికా ప్రావిన్స్‌లోని ఆమె నివాసంలోకి గురువారం మధ్యాహ్నం ప్రవేశించి తాలిబన్లు ఆమె భర్తను మరియు ఇతర కుటుంబ సభ్యులను ఇంట్లోనే కట్టేసి, అనంతరం సుష్మితా బెనర్జీను ఇంటి బయటకు తీసుకొచ్చి కాల్చి చంపేసి, మృతదేహాన్ని దగ్గరల్లో ఉన్న ఓ పాఠశాల వద్ద పడేసినట్లు పోలీసులు తెలిపారు. "ఎస్కేప్ ఫ్రమ్ తాలిబన్", "కాబూలివాలా బంగాలి బువా" పేరుతో రాసిన పుస్తకాలతో బెనర్జీ మంచి పేరు సంపాదించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...