పాకిస్తాన్ పై ఇండియా సూపర్ విక్టరీ

Publish Date:Dec 29, 2012

 

India win second T20, India vs Pakistan 2012, india beat pakistan, Yuvraj sting has Pakistan smarting

 

 

అహ్మదాబాద్ లో పాకిస్తాన్ తో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచులో యువరాజ్ సింగ్ సిక్స్ ల మోత మోగించాడు. పాకిస్తాన్ పై భారత్ 11 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్ ల ట్వంటీ20 సిరీస్ ను సమం చేసింది. 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఏడు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో యువీ సత్తా చాటాడు. ఓ వికెట్ కూడా తీసుకున్నాడు. యువరాజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడు.

 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దీగిన భారత్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభానిచ్చారు. గౌతమ్ గంభీర్ 21, రహనే 28 పరుగులు చేసి ఉమర్ గుల్ బౌలింగ్ లో అవుటయ్యారు. యువరాజ్ మెరుపులకు, ధోని సహకారం అందించడంతో ఇండియా 20 ఒవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దీగిన పాకిస్తాన్ ఓపెనర్లు అదరగొట్టినప్పటికీ, ఆ తరువాత బ్యాట్స్ మెన్లు ఎవరు నిలదొక్కుకోలేకపోయారు. నసీర్ జంషెడ్ 41 పరుగులు, సెహజాద్ 31, కెప్టెన్ మొహ్మద్ 39 బంతుల్లో 55 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. పాకిస్తాన్ ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.భారత బౌలర్లలో దిండా మూడు వికెట్లు తీసుకోగా, కుమార్, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు.