ధోని 50..ఇండియా 316 ఆలౌట్

 

India vs England, England india, india 316 allout, sachin 50

 

ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మొదటి ఇనింగ్స్ లో భారత్ 316 పరుగులకు ఆలౌటైంది. ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా కేవలం నాలుగు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. జహీర్ ఖాన్(6), ఇషాంత్ శర్మ(0)తో ఔటయ్యారు. ఒంటరి పోరాటం చేసిన ధోని 52 పరుగుల చేసి అవుటవ్వడంతో ఇండియా 316పరుగులు చేయగలిగింది.ఇంగ్లాండు బౌలర్లలో అండర్సన్ మూడు, పనేసర్ నాలుగు, స్వాన్ ఒక వికెట్ తీసుకున్నారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న ఇండియా 47 పరుగుల వద్ద సెహ్వాగ్ 23 తొలి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత పనేసర్ పుజారాను 16 పరుగుల వద్ద అవుట్ చేశాడు. గంభీర్ 60 అర్థ సెంచరీ చేసి పనేసర్ బౌలింగులో ట్రాట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇంగ్లాండుతో జరుగుతున్న సిరీస్‌లో విరాట్ కోహ్లీ విఫలమవుతూ వస్తున్నాడు. కేవలం ఆరు పరుగులు చేసి కోహ్లీ అండర్సన్ బౌలింగ్‌లో పెవిలియన్ దారి పట్టాడు.



ఆ తర్వాత కాసేపటికి వచ్చిన యువరాజ్ సింగ్ నిలదొక్కుకున్నట్లుగానే కనిపించాడు. అయితే 32 వ్యక్తిగత పరుగుల వద్ద స్వాన్ బౌలింగులో కుక్‌‌కు క్యాచ్ ఇచ్చాడు. 215 పరుగుల వద్ద భారత్ 5 వికెట్ కోల్పోయింది. సచిన్ టెండూల్కర్ సెంచరీ దిశగా వెళ్తున్న సమయంలో అతను అండర్సన్ బౌలింగులో ప్రియర్‌కు దొరికిపోయాడు. సచిన్ రూపంలో ఆరో వికెట్ భారత్ కోల్పోయింది. సచిన్ 76 పరుగులు చేశాడు. భారత్ స్కోర్ 230 వద్ద ఉన్నప్పుడు ఔటయ్యాడు. ఇది టెండూల్కర్‌కు 66వ అర్థ సెంచరీ.