కుక్ ఒంటరి పోరాటం, ఇంగ్లాండ్ 235/5

Publish Date:Nov 18, 2012

 

India vs England 2012,  India vs England  Live, India vs England Live score,  India vs England test 2012

 

అహ్మదాబాదులో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 123 పరుగుల వద్ద కామ్టన్ జహీర్ ఖాన్ బౌలింగులో అవుట్ కాగా, ఓజా బౌలింగ్‌లో పీటర్సన్, ట్రాట్ వెనుదిరిగారు. ఉమేష్ యాదవ్ రెండు వరుస బంతుల్లో ఇయాన్ బెల్, సమిత్ పటేల్‌ను ఔట్ చేశాడు.


నాల్గో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఇంగ్లాండ్ వికెట్‌ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆల్ ఔట్ అయిన ఇంగ్లాండ్ ఫాలో ఆన్ ఆడుతోంది. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా కుక్ ఒంటరి పోరాటంతో సెంచరీ చేశాడు. కామ్టన్ 37, ట్రాట్ 17, పీటర్సన్ 2, ఇయాన్ బెల్ 22 పరుగులు చేసి అవుటయ్యారు. సుమిత్ డకౌట్ అయ్యాడు. ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 230పరుగులతో ఆడుతోంది.