పారిస్ ఒలింపిక్స్.. షూటింగ్ లో భారత్ కు మరో కాంస్య పతకం

posted on: Aug 1, 2024 4:40PM

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో కాంస్య పతకం లభించింది. పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో భారత షూటర్ స్వప్నిల్ కాంస్య పతకం సాధించాడు. ఈ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకూ భారత్ కు మూడు కాంస్య పతకాలు వచ్చాయి. మూడూ కూడా షూటింగ్ లోనే కావడం గమనార్హం.

  మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో మను బాకర్ ఇప్పటికే రెండు కాంస్యాలు కైవసం చేసుకోవడం తెలిసిందే. గురువారం (ఆగస్టు 1) 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3పీ ఫైనల్ ఈవెంట్ లో స్వప్నిల్ కుశాలే 451.4 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. 28 ఏళ్ల స్నప్నిల్ కుశాలేకు ఒలింపిక్స్ లో ఇదే తొలి పతకం.  

google-ad-img
    Related Sigment News
    • Loading...