TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లోనూ భారత్ కు స్వర్ణం

Published on: Mon Aug 8, 2022 8:30PM

కామన్వెల్త గేమ్స్ చివరి రోజు సోమవారం ( ఆగస్టు 8)భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కనకవర్షం కురిపించారు. మహిళల సింగిల్స్ లో సింధు, పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ లు స్వర్ణాలు సాధించగా, ఆ తరువాత కొద్ది సేపటికే పురుషుల డబుల్స్ లో రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి ఇంగ్లాండ్ జోడీ బెన్ లెన్ సీన్ వెండీలపై వరుస సట్లలో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకున్నారు.

దీంతో ఒకే రోజు బ్యాడ్మింటన్ లో భారత్ కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి. కాగా టీటీలో కూడా భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాడు లియామ్ పిచ్ పోర్డ్ పై 4-1 తేడాతో గెలిచి స్వర్ణ పతకం అందుకున్నాడు. కామన్వెల్త్ క్రీడలలో భారత్ మొత్తం 61 పతకాలు కైవసం చేసుకుని పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

ఈ పతకాలలో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషుల హాకీలో భారత్ ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై రజత పతకం గెలుచుకుంది.