టీమిండియాకు భారీ నజరానా...

posted on: Mar 28, 2017 6:18PM

 

ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సిరీసుల్లో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.  రెండో ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన అసీస్ కేవలం 137 పరుగులు మాత్రమే చేసి అతి స్వల్ప లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగా..భారత్ ఈరోజు ఆట ప్రారంభించిన కొద్ది సమయానికే లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో సిరీస్ చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు సిరీస్ను కైవసం చేసుకున్నందుకుగాను... బీసీసీఐ  భారీ నజరానా ప్రకటించింది. భారత ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నజరానా ప్రకటించింది. ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేకు రూ.25 లక్షల రివార్డు, ఇతరత్రా సిబ్బంది ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు అందజేయనున్నట్లు తెలిపింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...