ఆసీస్ ఆలౌట్.. భారత్ లక్ష్యం 106..

posted on: Mar 27, 2017 4:37PM

 


ధర్మశాల వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన ఇండియా... 332 పరుగులకు ఆలౌటై.. 32 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఆది నుండి కష్టాల్లో పడి చివరికి 137 పరుగుల వద్ద  ఆలౌట్ అయి భారత్ కు 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన వార్నర్, స్మిత్ ల వికెట్లు తీయడంతో టీమిండియా కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇక ఆతరువాత బౌలర్లు రెచ్చిపోయి ఒక వికెట్ తరువాత ఒకటి తీసి అందరికి పెవిలియన్ పంపించారు. దీంతో ఆసీస్ కేవలం 137 పరుగులే చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో మూడేసి వికెట్లు తీసి ఆకట్టుకోగా, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీసి వారికి సహకరించాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...