కష్టాల్లో ఆసీస్.. కీలక వికెట్లు ఔట్

posted on: Mar 27, 2017 1:12PM



ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భాగంగా జరిగిన తొలి ఇన్నింగ్స్ లో భారత్ 32 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఇండియా భారీ ఆధిక్యాన్ని ఇవ్వలేదన్న హ్యాపీతో బ్యాటింగ్ కు దిగినా.. ఆ సంతోషం ఎంతోసేపు నిలవకుండా పోయింది. రెండో ఇన్నింగ్స్ లో  కీలకమైన రెండు వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారు. ఓపెనర్ వార్నర్ వికెట్ ను యాదవ్ తీయగా, కెప్టెన్ స్మిత్ వికెట్ ను భువనేశ్వర్ కుమార్ పడగొట్టాడు. వార్నర్ 6 పరుగులకు, స్మిత్ 17 పరుగులకు అవుట్ కాగా, 9 ఓవర్లలోనే 31 పరుగులకు రెండు వికెట్లను కోల్పోయి ఆ జట్టు కష్టాల్లో పడ్డట్లయింది. కాగా తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్..300 పరుగులు చేయగా.. ఇండియా 332 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

google-ad-img
    Related Sigment News
    • Loading...