TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మత్స్య సంపదకు మేనరికం ముప్పు

Published on: Tue Apr 3, 2012 9:23AM

రాష్ట్రంలో మత్స్య సంపాదకు ఒక కొత్త ముప్పు ఎదురైంది. సాధారణంగా స్త్రీ పురుషుల మధ్య మేనరికం వివాహాలను వైద్యులు సిఫార్సు చేయరు. మేనరికం వివాహాలు జరిగితే పుట్టబోయే బిడ్డలు అవలక్షణాలతో లేదా అవయవ లోపాలతో జన్మిస్తారని పరిశోధనలో తేలింది. అయితే ఇప్పుడు ఈ ముప్పు చేపలు, రొయ్యలకు కూడా ముంచుకొచ్చింది. హేచరీలలోనూ, చేరువులలోనూ కృత్రిమ పద్ధతుల్లో చేపపిల్లలను, రొయ్యపిల్లలను పెంచుతున్నారు. ఇలా హేచరీల్లో తయారవుతున్న మత్స్య సంపద ఎక్కువగా ఇన్ బ్రీడ్ (మేనరికం) తరహాలోనే తయారవుతుంది.

ఒకే సంతతికి చేఇండిన చేపలను అదే సంతతికి చెందిన చేపలతో సంహోగం జరిపించడం వల్ల ఉత్పత్తి అవుతున్న గుడ్లను హేచరీల్లో పొడిగిస్తున్నారు. దీంతో ఇలా ఊపిరి పోసుకుంటున్న చేపలు, రొయ్యలు రోగనిరోధక శక్తిని బాగా కోల్పోతున్నాయి. తరచుగా వైరస్ ల బారినపడుతున్నాయి. ఇప్పటికీ ఈ ప్రభావం కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని చేపలు, రొయ్యల చెరువుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇన్ బ్రీడ్ మత్స్య సంపాదకు పలు రోగాలు కూడా వస్తున్నట్లు మత్స్యశాఖ నిపుణులు అంటున్నారు. వీటిని నివారించడానికి కూడా మందులు లేవని వారు చెబుతున్నారు. ఈ సమస్యవల్ల రాష్ట్రంలో మత్స్యవ్యాపారులు ఇప్పటికే కోట్లాది రూపాయలు నష్టపోయినట్లు తెలుస్తోంది.