Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...2014 ఎన్నికల్లో గెలవడం కష్టమే ... రామచంద్రయ్య
posted on: Apr 1, 2013 1:07PM
.png)
2004లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం విద్యుత్ ఛార్జీల పెంపేనని, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనని దేవాదాయాశాఖా మంత్రి సి.రామచంద్రయ్య ఆవేదనను వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలపెంపుపై ఏకపక్ష నిర్ణయాలు తగవని, ఎవరిని సంప్రదించి నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తెలియకుండానే ఈఆర్సీ నిర్ణయం వెలువరిస్తుందా అని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ను నిలదీశారు. ఈఆర్సీ ఎంత స్వాతంత్ర సంస్థ అయినా ప్రభుత్వం అనుమతిలేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంపై చర్చించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు లేఖలు వ్రాసినట్టు చెప్పారు.


.jpg)
.jpg)


