TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్.. ఖాతా తెరవాలంటే మినిమం బ్యాలెన్స్ 50 వేలు ఉండాల్సిందే!

Published on: Sat Aug 9, 2025 2:53PM

ప్రమఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తాజాగా తీసుకున్న నిర్ణయం కొత్త కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆగస్ట్ 1 నుంచి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసే వారు ఇకపై మినిమం బ్యాలెన్స్ రూ.50 వేలు మెయింటెన్ చేయాలని స్పష్టం చేసింది.  తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్‌ మినిమం బ్యాలెన్స్ విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం ముఖ్యంగా మెట్రో, అర్బన్ ఏరియాల్లో సేవింగ్స్ అకౌంట్‌లకు మినిమం బ్యాలెన్స్ రూ.10,000 నుంచి ఏకంగా రూ.50,000కి పెంచేసింది. ఈ కొత్త రూల్ ఆగస్టు 1, 2025 తర్వాత ఓపెన్ అయ్యే అన్ని కొత్త ఖాతాలకూ వర్తిస్తుంది. ఈ విషయం శనివారం బ్యాంక్ విడుదల చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.

దీంతోపాటు సెమీ-అర్బన్, రూరల్ ఏరియాల్లో కూడా మినిమం బ్యాలెన్స్ పెంచారు. సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు రూ.5,000 మినిమం బ్యాలెన్స్ ఉంటే, ఇప్పుడు అది పాతిక వేల రూపాయలకు పెరిగింది.   అలాగే గ్రామీణ ప్రాంతాల బ్రాంచ్‌లలో రూ.2,500 నుంచి రూ.10,000కి పెంచారు. అంటే, ఇప్పుడు ఎక్కడైనా సరే, అకౌంట్‌లో ఎక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.