36మందికి కరోనా అంటించిన ఐఏఎస్ అధికారిణి..!

posted on: Apr 12, 2020 3:20PM

ఆస్పత్రికి రానంటూ మొండిపట్టు, ఇంటి వద్దే డాక్టర్ల సపర్యలు..!!

మధ్యప్రదేశ్ లో ఐఏఎస్ అధికారిణి పల్లవిజైన్ గొవిల్ వ్యవహారం మరింత వివాదంగా మారుతోంది. ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ ఆమె. కొడుకు ట్రావెల్ హిస్టరీని దాచిపెట్టింది. విదేశాలనుంచి వచ్చిన కొడుకు కారణంగా ఆమెకు కరోనా సోకింది. అది బైటపడేలోపే.. ఆమె ఇతర అధికారులతో కలిపి అనేక సమీక్షలకు హాజరైంది.. 

మొత్తం ఆమె కారణంగా 36మందికి మధ్యప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖలో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో పల్లవి జైన్ హోమ్ ఐసోలేషన్ లో ఉంది. ఆస్పత్రికి రాకుండా.. ఇంటి వద్దకే డాక్టర్లు వచ్చి వైద్యం అందించాలని హుకుం జారీ చేసింది. ఉన్నతాధికారి కావడంతో.. డాక్టర్ల బృందం ఉదయం, సాయంత్రం ఆమెకు వైద్యం అందించడానికి వెళ్తోంది.. 

ఈ వ్యవహారంపై మానవహక్కుల సంఘం సీరియస్ గా స్పందించింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఆస్పత్రికి ఎందుకు తరలించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...