TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రులు, ఐఏఎస్ల కు నోటీసులు

Published on: Fri Mar 30, 2012 3:07PM

హైదరాబాద్ : 26 జీవోలకు సంబంధించి ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్‌లకు సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులు శుక్రవారం అందాయి. జీవోలపై అప్పటి మంత్రులను కూడా విచారించాలంటూ నెల్లూరుకు చెందిన న్యాయవాది సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నోటీసులు అందుకున్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీ నారాయణలు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ నోటీసులు అందుకున్నట్లు తెలిపారు.